హీరో ధనుష్‌కీ, హీరోయిన్ శ్రుతి హాసన్‌కీ మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ ఓ ఆర్టికల్ రాసిన ఓ తమిళ పత్రిక, ఆ తర్వాత అది రాసినందుకు క్షమాపణలు తెలిపిందని మీకు తెలుసా? పదేళ్ల క్రితం.. అంటే 2012లో ఈ ఉదంతం జరిగింది. ఆ కథనం చదివిన శ్రుతి తీవ్ర ఆగ్రహానికి గురైంది. రజనీకాంత్ కుటుంబంతో ఆమెకు సన్నిహితత్వం ఉంది. రజనీకాంత్, కమల్ హాసన్ సన్నిహిత స్నేహితులు. అలాంటిది ఆ కుటుంబం అల్లుడితో తను రిలేషన్‌షిప్‌లో ఉన్నానని రాయడం శ్రుతి హాసన్ ఆవేదన వ్యక్తం చేసింది.
అంతటితో ఆగకుండా, ఆ కథనం వండిన పత్రికపై కేసు కూడా పెట్టింది. తన లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపించింది. దాంతో దిగి వచ్చిన ఆ పత్రిక అలాంటి స్టోరీ ప్రచురించినందుకు విచారం వ్యక్తంచేస్తూ శ్రుతికి క్షమాపణలు తెలియజేసింది. అప్పట్లో ఈ విషయాన్ని స్వయంగా తెలియజేస్తూ, "ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది. నా మీద ఆ పత్రిక రాసిన స్టోరీకి ఎలాంటి ఆధారాలు లేవు. అందుకే క్షమాపణలు చెప్పారు. మొత్తానికి నాకు హ్యాపీగా ఉంది" అని చెప్పింది శ్రుతి.
రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను ధనుష్ వివాహం చేసుకున్న విషయం మనకు తెలుసు. వారికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. కాగా, ఇటీవల తెలీని కారణాలతో ఆ ఇద్దరూ విడిపోయారు. పిల్లలు తల్లిదగ్గరే ఉంటున్నారు. నిజానికి ధనుష్, శ్రుతి జంటగా నటించిన '3' మూవీని డైరెక్ట్ చేసింది స్వయంగా ఐశ్వర్య కావడం గమనార్హం. ప్రస్తుతం డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో రిలేషన్‌షిప్‌లో ఉంది శ్రుతి.